అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్‌లో తాజాగా ఓ హనీట్రాప్ వ్యవహారం (honeytrap case) బయట పడింది. డింపుల్ యాదవ్ అనే మహిళ భర్తతో కలిసి ఓ యువకుడిని హనీట్రాప్ చేసింది. సదరు యువకుడితో పరిచయం పెంచుకున్న ఆమె.. ఒక రోజు నిద్రమాత్రలు ఇచ్చి న్యూడ్ వీడియో రికార్డు చేసింది. అనంతరం దంపతులు ఇద్దరు కలిసి ఆ యువకుడిని బెదిరించడం ప్రారంభించారు. రూ.10 లక్షలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. లేదంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ (blackmaile) చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు (task force police) ఐదుగురిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
Hyderabad | డబ్బు కోసం ఎంతకైనా..
ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. డబ్బు కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. సోషల్ మీడియా (social media) మాయలో పడి చాలా మంది తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుంటున్నారు. వారు ముందు మంచిగా మచ్చిక చేసుకొని తర్వాత హానీట్రాప్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో (Hyderabad City) ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఇలాగే హనీట్రాప్‌లో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని కొందరు మహిళలు ట్రాప్ చేస్తున్నారు. అనంతరం వీడియోల పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బయట పడితే తమ పరువు పోతుందని చాలా మంది డబ్బులు ఇచ్చి సైలెంట్‌గా ఉండిపోతున్నారు.