అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyber Fraud | సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను మాయమాటలతో నమ్మించి.. ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. పార్ట్ టైం జాబ్స్(Part Time Jobs), వర్క్ ఫ్రం హోమ్, స్టాక్ మార్కెట్(Stock Market) పేరిట ప్రజలకు వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాటలు నమ్మి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ మహిళ సైబర్ వలలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్(Hyderabad)లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్(KPHB Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
Cyber Fraud | పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనూష
కేపీహెచ్‌బీలో నివాసం ఉంటుంది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్ చూసింది. సదరు నంబర్‌కు కాల్ చేయగా.. సైబర్ నేరగాడు మాయమాటలు చెప్పి ఆమెను మోసం చేశాడు. దీంతో ఆమె సుమారు రూ.లక్ష వరకు పోగొట్టుకుంది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అనూష గురువారం ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసిన అనూష యాప్‌ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని అందులో కోరింది.