అక్షరటుడే, బాన్సువాడ: Banswada | దుస్తులు ఉతికేందుకు కాలువలో దిగిన ఓ మహిళ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. ఈ ఘటన నస్రుల్లాబాద్ మండలం (Nasrullabad mandal) సంగెం గ్రామంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో (Nizam Sagar main canal) గురువారం చోటు చేసుకుంది.
Banswada | కొడుకుతో కలిసి వెళ్లిన మహిళ..
ఎస్సై రాఘవేందర్ (Sub-Inspector Raghavender) తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన సునీత(32) పెద్ద కొడుకు రంజిత్‌తో కలిసి నిజంసాగర్ కాలువలో దుస్తులు ఉతికేందుకు వెళ్లింది. దుస్తులు ఉతికే క్రమంలో కాలుజారి కాలువలో కొట్టుకుపోయింది. దీంతో కొడుకు గట్టిగా హాహాకారాలు చేయగా.. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాలువకు కొద్దిదూరంలో ఆమె మృతదేహం లభించింది. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.