Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన బోధన్​ మండలంలో చోటు చేసుకుంది. రూరల్​ ఎస్సై మచ్చేందర్​ (Rural SI Machender) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​ మండంలోని పెంటకుర్దు గ్రామంలో చంద్రకళ (50) ఒంటరిగా నివాసముంటోంది. ఆమె కొడుకు పనినిమిత్తం మహారాష్ట్రలో ఉంటున్నాడు. అయితే సోమవారం ఆమె ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు గమనించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె చెవి కమ్మలు, ఇతర ఆభరణాలు కనిపించడం లేదు. కాగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.