అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని ఆర్యనగర్‌లో (Arya Nagar) ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్యనగర్‌లో నివాసముండే నిఖిత(36)కు ప్రతిరోజు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆదివారం సాయంత్రం సైతం ఆమె మద్యం తాగగా.. భర్త కోపోద్రిక్తుడిపై కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆమెను జీజీహెచ్‌కు (GGh Nizamabad) తరలించగా మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. 4వ టౌన్ పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Nizamabad City | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
- Advertisement -
