Homeక్రైంMedchal | బైక్​పై వెళ్తుండగా తెగిపడిన విద్యుత్​ తీగ.. మహిళ మృతి

Medchal | బైక్​పై వెళ్తుండగా తెగిపడిన విద్యుత్​ తీగ.. మహిళ మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medchal | బైక్​పై వెళ్తున్న ఓ మహిళను విద్యుత్​ తీగ(Electric Wire) రూపంలో మృత్యువు కబళించింది. ఈదురుగాలులకు విద్యుత్​ తీగ తెడిపడటంతో షాక్​ కొట్టి మహిళా మృతి చెందింది

ఇదే ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్​ (Medchal district) జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. సురేశ్​, మౌనిక దంపతులు తమ మూడేళ్ల కుమారుడు శ్రేయాస్​తో బైక్​పై వెళ్తున్నారు. అయితే ఈదురుగాలులకు విద్యుత్​ తీగ తెగి వారిపై పడింది. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందగా.. సురేష్, శ్రేయాస్‌ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.