HomeUncategorizedKadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

Kadapa | ఎలక్ట్రిక్‌ బైక్​ పేలి మహిళ మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్​ బైక్(Electric Bike)​ పేలి ఓ మహిళ మృతి చెందింది. ఇంధన దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు, కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్​ బైక్​లు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రంగ రవాణా సంస్థలు కూడా ఎలక్ట్రిక్​ బస్సులను(Electric Buses) కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్​ బైక్​లు పేలిపోతుండటంతో వాటిని కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.

కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం(Potladurthi village)లో ఎలక్ట్రిక్​ బైక్​ పేలిపోయింది. బైక్​కు ఛార్జింగ్​ పెట్టి పడుకున్నారు. అయితే రాత్రి పూట ఒక్కసారిగా అది పేలిపోయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళా మృతి చెందింది. దీంతో ఎలక్ట్రిక్​ బైక్​లు వినియోగించే వారు ఆందోళన చెందుతున్నారు. కాగా గతంలో సైతం పలు చోట్ల ఎలక్ట్రిక్​ బైక్​లు దగ్ధమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యుత్​ వాహనాల భద్రతపై ఆందోళన నెలకొంది.