Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | రైలు కిందపడి వృద్ధురాలి మృతి

Nizamabad City | రైలు కిందపడి వృద్ధురాలి మృతి

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలు కిందపడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్​ రైల్వేస్టేషన్​ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​ రైల్వేస్టేషన్ ​(Nizamabad Railway Station) సమీపంలో ఓ వృద్ధురాలు మృతి చెందిందని స్టేషన్​ మేనేజర్​ సాగర్​ సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్​కు తరలించామని.. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని రైల్వే ఎస్సై తెలిపారు. సమాచారం తెలిస్తే రైల్వే పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.