HomeతెలంగాణRTC bus | ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

RTC bus | ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

- Advertisement -

అక్షరటుడే, బోధన్: RTC bus | ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్​పాడ్​ గ్రామానికి చెందిన చాకలి నాగమణి పని నిమిత్తం నిజామాబాద్​ వచ్చింది. మంగళవారం బోధన్​ బస్​ ఎక్కి మంగళపాడ్​ వద్ద దిగింది. అయితే నాగమణి బస్సు దిగి వెళ్తున్నట్లుగా డ్రైవర్​ గమనించకుండా బస్సును ముందుకు తోలడంతో బస్సు ముందు చక్రాల కింద పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును పోలీస్​స్టేషన్​కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.