Domakonda
Domakonda | పిచ్చికుక్క దాడి: మహిళ మృతి

అక్షరటుడే, కామారెడ్డి: Domakonda | పిచ్చి కుక్క దాడిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దోమకొండ మండలం ముత్యంపేటలో (MutyamPet) జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింపాల సత్తవ్వ (36) ఈనెల 6న ఇంటిముందు వాకిలి ఊడుస్తుండగా పిచ్చికుక్క కరిచింది. దీంతో ఆమె ముఖంపై తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. కాగా.. బాధితురాలు చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. సత్తవ్వతోపాటు మరికొందరిపై పిచ్చికుక్క దాడి చేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద నివారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.