అక్షరటుడే, ఆర్మూర్: Nandipet | నందిపేట్ మండలం ఐలాపూర్ (Ailapur) గ్రామ శివారులో మహిళ దారుణహత్యకు గురైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత(35) అంగడి నిమిత్తం సోమవారం నందిపేట్కు వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబీకులు గాలించారు. ఐలాపూర్ గ్రామ శివారులో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.