అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో మహిళా కానిస్టేబుల్ (woman constable) ఆత్మహత్యా యత్నం చేసింది. మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ (Uppal police station) పరిధిలోని పద్మావతి కాలనీలో నివసిస్తున్న ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్లో (Nacharam police station) కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. తాను నివసం ఉంటున్న భవనం మూడో అంతస్తు నుంచి ఆమె సోమవారం కిందకు దూకింది. దీంతో తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలతో సూసైడ్‌కు యత్నించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | మనస్తాపంతో..
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) బీబీనగర్ మండలం రవి పహార్ తండాకు చెందిన ప్రమీల 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. భర్త బాలాజీ నాయక్, పిల్లలతో కలిసి ఉప్పల్ పద్మావతి కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. అయితే ఆమె కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలైన ఆమె ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Hyderabad | పెరుగుతున్న ఘటనలు
సాధారణంగా ఆత్మహత్యలు చేసుకునే వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తారు. అయితే అలాంటి పోలీసులే ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సమస్యలతో పలువురు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు తనువు చాలిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు పెరిగాయి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసలు అయి కూడా కొందరు కానిస్టేబుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతరులకు చెప్పాల్సిన పోలీసులే ధైర్యం కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులకు అప్పుడప్పుడు గేమ్స్, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే కౌన్సెలింగ్ సైతం చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.