అక్షరటుడే, ధర్పల్లి: Chain snatching | బొట్టు బిళ్లలు విక్రయించేందుకు వచ్చిన మహిళ చైన్ స్నాచింగ్ కు పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో (Dharpally mandal) సోమవారం చోటుచేసుకుంది.
Chain snatching | మెల్లిగా మాటలు కలిపి..
ఎస్సై శ్రీనివాస్ (Sub-Inspector Srinivas) తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో పోతుగంటి మల్కవ్వ ఇంటి బయట ఉండగా.. ఓ మహిళ బొట్టు బిళ్లలు, ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తూ ఆమె వద్దకు వచ్చింది. మల్కవ్వతో మాటలు కలిపింది.
చుట్టు పక్కల ఎవరూ లేని సమయంలో అదును చూసి ఒక్కసారిగా మల్కవ్వ మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పారిపోయింది. బాధితురాలు అరిచినా ఫలితం లేకుండా పోయింది. బాధితురాలి బంధువు గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.