అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Traffic Police | రోడ్డుపై ఫిట్స్‌తో ఓ మహిళ పడిపోగా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆమెకు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం నిఖిల్‌సాయి చౌరస్తా (Nikhil Sai Chowrasta) వద్ద చోటు చేసుకుంది.
ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద ఓ మహిళకు ఫిట్స్ రావడంతో రోడ్డుపై పడిపోయింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆర్డీ రమేష్, పెద్దన్న, శ్రావణ్, హోంగార్డు శాకీర్ స్పందించారు. వెంటనే ఆమెకు సపర్యలు చేశారు. ఆమెకు తోడుగా భర్త ఉండగా వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆపదలో మహిళకు సాయం అందించిన ట్రాఫిక్ పోలీసులను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.