అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఉద్యోగాలిప్పిస్తానని ఓ మహిళ నిరుద్యోగులను మోసం చేసింది. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది.
Nizamabad City | ఆర్అండ్బీ డిపార్ట్మెంట్లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రామావత్ రాజు డిగ్రీ పూర్తిచేశాడు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం (government job) కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి జీ శ్రీనివాస్ అనే మిత్రుడు ద్వారా గొబ్బి స్వరూప అనే మహిళ పరిచయమైంది. ఆమె తనకు తాను ఆర్అండ్బీ డిపార్ట్మెంట్లో (R&B Department) పీఏవోగా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకుంది.
Nizamabad City | రూ.4లక్షలు తీసుకుని మోసం..
రోడ్లు భవనాల శాఖలోనే జానియర్ అసిస్టెంట్ ఉద్యోగం (Junior Assistant job) ఇప్పిస్తానని సదరు మహిళ స్వరూప బాధితుడు రాజు వద్ద నుంచి రూ.4 లక్షల తీసుకుంది. తన మిత్రుడి వద్ద కూడా రూ.7 లక్షలు తీసుకొని ఏడాదిగా ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెడుతూ వస్తోంది. ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బు తమకివ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆమె డబ్బులిచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ వారినే బెదిరించింది. మోసపోయామని గ్రహించిన బాధితులు రాజు, శ్రీనివాస్‌లు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.