అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని దారుణంగా హతమార్చారు.
కాళ్లూ చేతులు కట్టేసి, కుక్కర్‌తో దారుణంగా బాదడమే కాకుండా కత్తితో గొంతు కోసి అభాగ్యురాలని కడతేర్చారు. హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో బుధవారం (సెప్టెంబరు 10) జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రాకేశ్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు సనత్ నగర్‌లో స్టీల్ దుకాణం నడుపుతున్నారు. వీరు కూకట్పల్లి Kukatpally స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ Swan Lake gated community లో ఉంటున్నారు.
కాగా, రేణు అగర్వాల్ బుధవారం సాయంత్రం ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. రేణు ఇంట్లో పనిచేసే ఇద్దరు యువకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
రేణు బంధువుల ఇంట్లో రోషన్ అనే యువకుడు గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. కాగా, రోషన్ ఇటీవలే జార్ఖండ్ కు చెందిన హర్ష్ అనే యువకుడిని రేణు అగర్వాల్ ఇంట్లో వంట మనిషిగా చేర్పించాడు.
Kukatpally murder case : లగ్జరీ లైఫ్ చూసి కన్ను కుట్టి..
ఇంట్లో దంపతుల లగ్జరీ లైఫ్ luxurious life ను చూసిన హర్ష్, రోషన్లకు కన్ను కుట్టింది. ఇంట్లో చాలానే డబ్బు, బంగారం, విలువైన వస్తువులు ఉంటాయని భావించిన ఈ యువకులు తమ కన్నింగ్ నేచర్‌కు తెరలేపారు.
బుధవారం ఉదయం రాకేశ్, అతడి కొడుకు శుభం దుకాణానికి వెళ్లిపోయారు. దీంతో రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని కన్నింగ్ నేచర్ యువకులు వినియోగించుకున్నారు.
మొదట రేణును చుట్టుముట్టి తాళ్లతో కాళ్లూచేతులు కట్టేసి బంధించారు. అనంతరం నగదు, నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలంటూ తీవ్రంగా చిత్ర హింసలకు గురిచేశారు.
కుక్కర్‌తో తలపై బలంగా బాదారు. అయినా ఆమె చెప్పకపోవడంతో వంటింట్లోని కూరగాయల కత్తులతో ఆమె గొంతు కోసి హతమార్చారు.
ఆ తర్వాత ఇల్లంతా గాలించారు. లాకర్‌ను బద్ధలు కొట్టారు. అందులో నుంచి అందినంత నగలు, నగదును తీసుకుని బ్యాగుల్లో నింపుకొన్నారు.
రేణును హత్య చేసే క్రమంలో ఒంటిపై ఉన్న దుస్తులకు రక్తపు మరకలు కావడంతో వాటిని తీసేసి, ఫ్రెష్‌గా స్నానం చేసి కొత్తవి వేసుకున్నారు.
Kukatpally murder case : దర్జాగా
ఆ తర్వాత నగదు, నగలతో కూడిన బ్యాగుతో నవ్వుతూ బయటకు వచ్చారు. ఇంటికి తాళం వేశారు. రేణు వాళ్ల స్కూటీని తీసుకుని దర్జాగా పారిపోయారు.
కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భర్త రాకేశ్, కొడుకు శుభం ఫోన్ చేయగా.. రేణు స్పందించలేదు. దీంతో రాకేశ్ ఇంటికి పరిగెత్తు కొచ్చారు.
తలుపు తడితే ఇంట్లో నుంచి స్పందన లేదు. దీంతో రాకేశ్ ప్లంబర్‌ను పిలిపించారు. అతడు వెనుక వైపు నుంచి ఇంట్లోకి వెళ్లి తలుపు తీశాడు.
అలా రాకేశ్ లోపలికి వెళ్లారు. అక్కడ హాల్లో తాళ్లతో కాళ్లూ చేతులు కట్టేసి, రక్తపు మడుగులో పడిఉన్న రేణును చూసి షాకయ్యారు. తన జీవిత భాగస్వామి రక్తపు ముద్దగా మారడాన్ని చూసి దు:ఖించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలో నిందితులు ఖాళీ చేతులతో లోపలికి వెళ్లడాన్ని, నిండు బ్యాగుతో బయటకు రావడాన్ని గుర్తించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.