HomeజాతీయంWoman Bites Man Tongue | లైంగిక దాడికి ప్రయత్నం.. కీచకుడి నాలుకను కొరికేసిన సివంగి!

Woman Bites Man Tongue | లైంగిక దాడికి ప్రయత్నం.. కీచకుడి నాలుకను కొరికేసిన సివంగి!

Woman Bites Man Tongue | ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్‌లో వేరే వ్యక్తితో పెళ్లి కుదిరిన యువతిని లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడు ఓ యువ‌కుడు. అత‌డి నుంచి కాపాడుకునేందుకు బాధిత యువ‌తి నాలుక కొరక‌డం హాట్​ టాపిక్​గా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Woman Bites Man Tongue | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో Kanpoor అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టబోయాడు.

ఆ సమయంలో, తన రక్షణ కోసం ఆ యువతి అతని నాలుకను బలంగా కొరికేయడంతో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, చంపి (35) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు.

అయితే, యువతి తల్లిదండ్రులు ఆమె పెళ్లిని వేరొకరితో ఖరారు చేయడంతో, చంపికి ఆమె దూరంగా ఉంటోంది. దీనిని అంగీకరించలేని చంపి తరచూ ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నించాడు.

Woman Bites Man Tongue | ఆత్మ‌రక్ష‌ణ కోసం..

ఓ రోజు యువతి ఒంటరిగా గ్రామం సమీపంలోని చెరువు వద్దకు వెళ్తున్నట్లు గమనించిన చంపి, ఆమెను వెంబడించి అదును చూసి పట్టుకున్నాడు. ప్రతిఘటిస్తున్న యువతిని లైంగికంగా వేధించడానికి ప్రయత్నించడమే కాకుండా బలవంతంగా ముద్దు పెట్టబోయాడు.

ఈ సమయంలో తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించిన యువతి అతని నాలుకను Tongue గట్టిగా కొరికేసింది. వెంటనే చంపి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు.

తీవ్ర రక్తస్రావం అవుతున్న నిందితుడిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కాన్పూర్‌లోని మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై డీసీపీ దినేష్ త్రిపాఠి Dinesh Tripathi మాట్లాడుతూ.. నిందితుడు చంపిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు, అతడిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సంఘటన యువతుల భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది.