అక్షరటుడే, కామారెడ్డి : Woman Assault | వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న 40 ఏళ్ల మహిళపై బీహార్ Bihar కు చెందిన ఓ కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ Palvancha మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో ఆదివారం (అక్టోబరు 26) మధ్యాహ్నం చోటుచేసుకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బాధిత మహిళ భర్త చనిపోయాడు. కాగా, రోజు మాదిరిగానే బాధిత మహిళ వ్యవసాయ agricultural పనుల కోసం చేను వద్దకు వెళ్ళింది.
Woman Assault | చేను మాటున కాపు కాసి..
పత్తి చేనులో గడ్డి కోస్తుండగా.. గ్రామ శివారులోని రైస్ మిల్లులో పనిచేసే బీహార్‌కు చెందిన కార్మికుడు కాపు కాసి ఆమెపై వెనుక నుంచి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో బాధిత మహిళకు తీవ్ర రక్తస్రావం అయింది. బాధిత మహిళను గుర్తించిన స్థానికులు.. ఆమెను జీజీహెచ్‌కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మహిళ నుంచి వివరాలు సేకరించారు. అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకుని ఆరా తీశారు. నిందితుడు పరారీలో ఉన్నట్టుగా సమాచారం.

