ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | రాత్రిపూట లిఫ్ట్ అడిగిన మహిళ.. మధ్యలో ఆపి దారి దోపిడీ

    Kamareddy | రాత్రిపూట లిఫ్ట్ అడిగిన మహిళ.. మధ్యలో ఆపి దారి దోపిడీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | రాత్రి పూట ఒంటరిగా బైక్​పై వెళ్తున్న యువకుడిని ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. పాపం అని లిఫ్ట్​ ఇస్తే సదరు మహిళ మరో వ్యక్తితో కలిసి యువకుడిని దారి దోపిడీ చేసింది. ఈ ఘటన కామారెడ్డిలో ఈ నెల 10న చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (Kamareddy Town CI Narahari) తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే ప్యారడైజ్ హోటల్​లో పని చేస్తుంటాడు. ఈ నెల 10న రాత్రి 10:45 సమయంలో పని ముగించుకుని ఇంటికి బయలు దేరాడు. పట్టణంలోని సీఎస్ఐ చర్చి (CSI Church) వద్ద ఓ మహిళ ఆయనను ఆపింది. తాను కూడా సరంపల్లి వెళ్తున్నానని, అక్కడి దాక లిఫ్ట్  (Lift) ఇవ్వాలని కోరగా సరేనని బైకుపై ఎక్కించుకున్నాడు. కామారెడ్డి పట్టణం దాటి ఈఎస్ఆర్ గార్డెన్ వద్దకు రాగానే వెనకాలే మరొక బైకుపై వచ్చిన వ్యక్తి రాజు బైక్​ను ఆపారు. సదరు వ్యక్తి, లిఫ్ట్​ అడిగిన మహిళ ఇద్దరు కలిసి రాజును కొట్టారు. అతడి జేబులో ఉన్న రూ.2 వేల నగదు, ఫోన్​ తీసుకొని పారిపోయారు. బాధితుడు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

    Kamareddy | గతంలో సైతం..

    లిఫ్ట్​ అడిగి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 18న సైతం ఇలాంటి ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. దోమకొండ (Domakonda) మండలం చింతమానుపల్లికి చెందిన ఓ వ్యక్తి కామారెడ్డి నుంచి వెళ్తుండగా ఓ మహిళ లిఫ్ట్​ అడిగింది. మార్గమధ్యలో ఆ మహిళ బైక్ ఆపమని చెప్పింది. బండి ఆపిన వెంటనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకడు తన భార్యను వెహికల్​పై ఎందుకు ఎక్కించుకున్నావని బెదిరించాడు. అంతేకాకుండా అతని వద్ద ఉన్న రూ.28 వేల నగదు, పర్సు లాక్కొని పారిపోయారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేశారు.

    Kamareddy | తెలియని వారికి లిఫ్ట్​ ఇవ్వొద్దు

    లిఫ్ట్​ పేరిట దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలు ఇటీవల రెచ్చిపోతున్నాయి. దీంతో గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్​ ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట ఎవరైనా లిఫ్ట్​ కోస వాహనాలు ఆపితే.. ఆపకుండా వెళ్లాలని చెబుతున్నారు. పగటి పూట సైతం రద్దీ లేని మార్గాల్లో ఎవరికి లిఫ్ట్ ఇవ్వొద్దని హెచ్చరించారు.

    Latest articles

    Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న...

    Rajasthan | బ్లూ డ్రమ్‌లో కుళ్లిన భ‌ర్త డెడ్ బాడీ.. భార్య‌, పిల్ల‌లు మిస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | మరోసారి బ్లూ డ్రమ్‌లో శవం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా(Alwar...

    Lok Sabha Speaker | నినాదాలు ఆపండి.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నించండి.. లోక్‌స‌భ‌లో ఎంపీల ఆందోళ‌నపై స్పీక‌ర్ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lok Sabha Speaker | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. సోమ‌వారం...

    Toll Gate | ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది.. వైర‌ల్‌గా మారిన వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Gate | టోల్‌ప్లాజా వ‌ద్ద ఆల‌స్యం జ‌రుగుతుండడాన్ని ప్ర‌శ్నించిన ఆర్మీ జ‌వానుపై (Army...

    More like this