Homeక్రైంKarimnagar | హైకోర్టు జడ్జిని అంటూ మోసం చేస్తున్న మహిళ అరెస్ట్

Karimnagar | హైకోర్టు జడ్జిని అంటూ మోసం చేస్తున్న మహిళ అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | హైకోర్టు జడ్జి(High Court Judge)ని అంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ మహిళను పోలీసులు అరెస్ట్​ చేశారు. తాను జడ్జిని అని కోర్టులో ఉద్యోగాల పేరిట పలువురిని ఆమె మోసం చేసింది. అంతేకాదు ఏకంగా ఓ సీఐని సైతం బురిడి కొట్టించిందంటే ఆమె టాలెంట్​ ఎంటో అర్థం చేసుకోవచ్చు. అంబర్​పేట్​కు చెందిన ప్రసన్నరెడ్డి అనే మహిళ తాను హైకోర్టు జడ్జిని అని చెప్పి మోసాలకు పాల్పడుతోంది. హైకోర్టులో రికార్డు అసిస్టెంట్(Record Assistant) ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించింది. దీంతో దాదాపు 100 మందికి పైగా అమాయకులు ఆమెకు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. అంతేగాకుండా తాను జడ్జినని సీఐని నమ్మించి వేములవాడ దేవాలయం (Vemulawada Temple) లో ప్రత్యేక దర్శనం కూడా చేసుకుంది. ఆమె మోసాలపై పలువురు ఫిర్యాదు చేయడంతో మధురానగర్​ పోలీసులు (Madhuranagar) కరీంనగర్​లో అరెస్ట్​ చేశారు.