అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | భూములు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి.. అక్రమంగా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ (South Rural CI Suresh) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన స్వర్ణ ప్రమీల మోపాల్ పోలీస్‌స్టేషన్ (Mopal Police Station) పరిధిలో ఐదుగురు వ్యక్తుల వద్ద మూడు ఎకరాల భూమి ఇప్పిస్తానని చెప్పి నమ్మించింది. వారి వద్ద నుంచి రూ.38,15,000 డబ్బులు తీసుకొని మోసం చేసింది.
కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు నిందితురాలిని గురువారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి బాధితులు సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ చేయడ్కు తరలించారు.
సదరు మహిళ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్య తీసుకుంటామని అన్నారు. ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించాలని చూసే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట మోపాల్ ఎస్సై సుస్మిత (Mopal SI Sushmita), సిబ్బంది ఉన్నారు.
