అక్షరటుడే, వెబ్‌డెస్క్: woman alone boyfriend | బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఫ్లాట్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె తండ్రి వచ్చాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి, తప్పించుకునే క్రమంలో ఎనిమిదో ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన భాగ్యనగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. పాత బస్తీకి చెందిన యువతి (20 ) మహా నగరం Hyderabad లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో పనిచేసే యువకుడితో పరిచయం ఏర్పడింది. సదరు యువతి కుటుంబానికి తెల్లాపూర్ లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది.
woman alone boyfriend | ఏకాంతంగా ఉన్న సమయంలో..
కాగా, ఆ ఫ్లాట్‌లో గురువారం తన స్నేహితుడితో సదరు యువతి ఏకాంతంగా గడుపుతోంది. అప్పుడే రేషన్ బియ్యం కోసం ఆమె తండ్రి సదరు ఫ్లాట్‌కు వచ్చాడు. బయట తలుపునకు తాళం వేసి ఉన్నా.. లోపల చప్పుడు అవుతుండటంతో అనుమానం వచ్చింది. దీంతో గట్టిగా అరిచాడు.
తండ్రి వచ్చిన విషయాన్ని గుర్తించిన సదరు యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయంత్నంలోనే యువతి ఎనిమిదో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్థానిక సర్కారు దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.