Homeక్రీడలుGautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన టీమిండియా, ఆ తర్వాత వరుస పరాజయాలతో విమర్శల పాలైంది. ఈ క్రమంలో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేప‌ట్టారు గౌత‌మ్ గంభీర్(Gautam Gambhir). ఆయ‌న ప‌ర్యవేక్ష‌ణ‌లో టీమిండియా(Team India) సంచల‌నాలు న‌మోదు చేస్తుంద‌ని అంతా భావించారు. కానీ గంభీర్ కోచ్‌గా నియమితుడైన తర్వాత తొలుత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓటమి, న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వైట్‌వాష్, అలాగే శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోవడం వంటి వరుస ఫలితాలతో అభిమానులు తీవ్ర‌నిరాశకు లోన‌య్యారు. దీంతో గంభీర్ భవిష్యత్తు సైతం ప్రశ్నార్థకంగా మారింది.

Gautam Gambhir | గంభీర్ ఎమోష‌న‌ల్..

ఇలాంటి స‌మ‌యంలో ఇంగ్లండ్ టూర్‌(England Tour)లో నాటకీయ విజయాలు సాధించింది భార‌త్. కుర్రాళ్ల‌తో కూడిన జ‌ట్టు అంచనాలకు భిన్నంగా రాణించింది. తొలి టెస్ట్ ఓటమి తర్వాత రెండో టెస్ట్‌లో భారీ విజ‌యం సాధించి సిరీస్ స‌మం చేసింది. మూడో టెస్ట్‌లో చివ‌రి వ‌ర‌కు పోరాడి కేవ‌లం 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక నాలుగో టెస్ట్ డ్రా అయింది. ఐదో టెస్ట్‌లో సెన్సేషనల్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయం గంభీర్ ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఓవల్‌లో ఐదో టెస్ట్ అనంతరం గంభీర్ బాలుడిలా సంబరాలు జరుపుకున్నాడు. తన జట్టును హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాధారణంగా ఎమోషన్లకు దూరంగా కనిపించే గంభీర్, ఇలా భావోద్వేగంతో క‌న్నీరు పెట్టుకోవ‌డం ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే గంభీర్ అంత ఎమోష‌న‌ల్ కావ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ టెస్ట్ సిరీస్‌(Test Series)ను కోల్పోతే గంభీర్ కోచ్ పదవి ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానాలు త‌లెత్తాయి. అందుకే ఈ విజయంతో ఊపిరి పీల్చుకున్న గంభీర్, తనలోని ఒత్తిడిని బయటపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విజయం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక కోచ్‌గా గంభీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడా? అన్నది త‌ర్వాత సంగ‌తి, కానీ అభిమానులు మాత్రం ఇప్పుడు ఆయనకు బలంగా మద్దతుగా నిలుస్తున్నారు. ఇక గెలుపు త‌ర్వాత గంభీర్ సోష‌ల్ మీడియా (Social media)లో స్పందిస్తూ.. కొన్ని గెలవచ్చు, కొన్ని ఓడిపోవచ్చు. కానీ ఎప్పటికీ లొంగిపోము. కుర్రాళ్లు మాత్రం అదరగొట్టారు! అంటూ జట్టు స్ఫూర్తిని ప్రశంసిస్తూ గంభీర్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతుంది.