అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake Documents | దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించడం.. అమాయకులను నమ్మించడం.. ఆఖరుకు నట్టేట ముంచడం.. ఇది నిజామాబాద్‌కు (Nizamabad) చెందిన నబీకి వెన్నతో పెట్టిన విద్య. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వందల కొద్ది మంది ఇతగాడి బాధితులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. డాక్యుమెంట్ రైటర్ (document writer) అవతారంలో రోజుకో తరహాలో వరుస మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా.. ఓ చీటింగ్ కేసులో నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులకు చిక్కాడు.
Fake Documents | నమ్మంచి.. నట్టేట ముంచి..
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కనకయ్య నిజామాబాద్ నగరంలోని (Nizamabad city) నాలుగో టౌన్ పరిధిలో నివసిస్తున్నాడు. బోర్గాం(పి) గ్రామానికి చెందిన చిలుక సాయిలు, షేక్ అహ్మద్ నబీ (ఫేక్ డాక్యుమెంట్ రైటర్) (fake document writer) పరిచయమయ్యారు. వ్యవసాయ భూమి కొనుగోలు చేయిస్తామని నమ్మబలికారు. దీంతో కనకయ్య వారికి 2022లో రూ. 46 లక్షలు వారికి ఇచ్చారు. డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రొఫెసర్ కనకయ్యకు అంటగట్టారు. తీరా తాను మోసపోయానని గుర్తించిన కనకయ్య వారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వకపోగా.. కాలయాపన చేసి బెదిరింపులకు పాల్పడడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.
Fake Documents | నిందితులిద్దరి రిమాండ్
ప్రొఫెసర్ కనకయ్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో ఎస్.సతీశ్ కుమార్ (Fourth Town SHO S. Satish Kumar) ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.
Fake Documents | గతంలోనూ నబీ మోసాలు
తనకు తాను డాక్యుమెంట్ రైటర్‌గా ప్రచారం చేసుకుని గతంలో నబీ ఎన్నో మోసాలకు పాల్పడ్డాడు. నకిలీ పత్రాలను సృష్టించి అమాయకుల నుంచి రూ. లక్షలు వసూలు చేశాడు. లేని భూమికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టి ఎంతో మందిని మోసగించాడు. గతంలో కామారెడ్డి పట్టణ పోలీసులు (Kamareddy town police) ఇతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయినా తీరు మార్చుకోకపోగా.. వరుస మోసాలకు పాల్పడుతున్నాడు.
