అక్షరటుడే, వెబ్డెస్క్ : Dense Fog | రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. శీతాకాలం ప్రారంభం నుంచే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మధ్యలో నాలుగు రోజులు చలితీవ్రత కాస్తా తగ్గిన మళ్లీ పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతతో పాటు పొగమంచు కారణంగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
దేశంలో ప్రతి సంవత్సరం చలికాలంలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents) అధికంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము సమయంలో ఎక్కవగా యాక్సిడెంట్లు అవుతాయి. దీనికి ప్రధాన కారణం పొగమంచు. రాత్రి సమయంలో పొగమంచు కురుస్తుంది. దీని ప్రభావంతో రోడ్డుపై ముందు ఉన్న వాహనాలు దూరం నుంచి కనిపించవు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
Dense Fog | జాగ్రత్తలు పాటించాలి
చలికాలంలో తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా కురుస్తుంది. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు దుప్పటి కప్పేస్తోంది. దీంతో వాహనదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. తెల్లవారుజామున ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు పాటించాలి. కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు చేసే వారు అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మంచు కురుస్తున్న సమయంలో ఫాగ్లైట్స్ (Foglights) ఉపయోగించాలి. వాహనాలు కనిపించకుండా మంచు పడే సమయంలో అతివేగంగా వెళ్లొద్దు.
Dense Fog | సడెన్ బ్రేక్ వేయొద్దు
మంచు కురిసే వేళ వాహనాలను అతివేగంగా నడపొద్దు. అలాగే సడన్ బ్రేక్ వేస్తే వాహనాలు జారిపడే అవకాశం ఉంది. అంతేగాకుండా వెనకాల వచ్చే వాహనాలు ఢీకొనే అవకాశం ఉంది. చలితీవ్రతతో అద్దాలపై తేమ చేరి ముందు వెళ్తున్న వాహనాలు కనిపించవు. దీనికోసం కార్లలో హీటర్లు వినియోస్తే సమస్య పరిష్కారం అవుతుంది. పొగమంచులో డ్రైవింగ్ చేసే సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయడానికి యత్నిస్తే జాగ్రత్తగా ఉండాలి. మంచుకారణంగా వాహనాలు ఎంతదూరంలో ఉన్నాయో గుర్తించడం కష్టం. కాబట్టి ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ‘లో బీమ్ హెడ్లైట్స్’ (Low Beam Headlights)ను ఉపయోగించాలి.
Dense Fog | వాహనాలను చెక్ చేసుకోవాలి
చలికాలంలో వాహనాల కండీషన్ చెక్ చేసుకోవాలి. టైర్లు గ్రిప్ ఉండేలా చూసుకోవలి. డూమ్లైట్, సిగ్నల్ లైట్లు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. లైట్లు, వైపర్లు సరిగా లేకుంటే రిపేర్ చేయించుకోవాలి. పసుపు రంగు ఫ్లాగ్ లైట్లను వినియోగిస్తే మంచులో సైతం వెనుక వచ్చే వాహనదారులకు కనిపించే అవకాశం ఉంది.