అక్షరటుడే, బాన్సువాడ: Volleyball tournament | క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని.. సమానంగా స్వీకరించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. బాన్సువాడ మినీ స్టేడియంలో (Banswada Mini Stadium) సోమవారం ఉమ్మడి జిల్లా వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక బలం కూడా పెరుగుతుందన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. బాన్సువాడ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వరరావు, పీడీ సురేందర్, నాయకులు నార్ల సురేష్, జంగం గంగాధర్, ఎజాజ్, ఖాలెక్, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
