అక్షరటుడే, హైదరాబాద్: Wingroup Asia | న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్‌గ్రూప్ ఏషియా సీఈఓ శ్రీ ఫామ్ చాన్ చౌ (Pham Sanh Chau) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించేందుకు విన్‌గ్రూప్ (Vingroup) బలమైన ఆసక్తి వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఫామ్ చాన్ చౌ తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్న విన్‌గ్రూప్ ఉద్దేశాన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సస్టైనబుల్, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక ఆసక్తి చూపిన ఫామ్ చాన్ చౌ.. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి ప్రణాళికలను అభినందిస్తూ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టేందుకు విన్‌గ్రూప్ సిద్ధంగా ఉందని తెలిపారు.
Wingroup Asia | రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం..
ఈ సమావేశం తెలంగాణలో గ్లోబల్ పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడంలో, భవిష్యత్తుకు దిశా నిర్ధేశం చేసే గ్రీన్, ఇన్నోవేషన్ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఒక కీలక ముందడుగుగా నిలిచింది.
పరిశ్రమలు & వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కోఆర్డినేషన్ (కేంద్ర ప్రాజెక్టులు & CSS) సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
