Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | వైన్‌షాప్‌లో చోరీ నిందితుడి అరెస్ట్‌

Yellareddy | వైన్‌షాప్‌లో చోరీ నిందితుడి అరెస్ట్‌

ఎల్లారెడ్డిలోని త్రిశూల్‌ వైన్స్‌లో చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. బుధవారం స్టేషన్​లో వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని త్రిశూల్‌ వైన్స్‌ షాపులో చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై మహేశ్‌ (SI Mahesh) తెలిపారు. బుధవారం స్టేషన్​లో వివరాలు వెల్లడించారు.

వైన్స్​ షాపులో చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. సీసీ పుటేజీ (CCTV footage) ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు పేర్కొన్నారు. పోసానిపల్లికి చెందిన పాత నేరస్తుడు జంగం నర్సింలు కూలీ పనులు చేసేవారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి, డబ్బులు సరిపోక, వైన్‌షాపులో చోరీ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు.

ఈ మేరకు అతని వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్, రూ.8,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు ప్రేమ్‌సింగ్, ఇద్రీజ్, హోంగార్డ్‌ సంతోష్‌ను అభినందించారు.