HomeతెలంగాణCM Revanth | రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా : సీఎం

CM Revanth | రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా : సీఎం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మార్పుల కోసం 12వ శతాబ్దంలోనే పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవన్న అన్నారు. ప్రతి మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తూ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. వీరశైవ లింగాయత్​ల సంక్షేమం, అభివృద్ధి కోసం వారిచ్చిన విజ్ఞాపనలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.