Homeజిల్లాలునిజామాబాద్​MLA Rakesh Reddy | రాంపూర్​ గ్రామాభివృద్ధికి కృషిచేస్తా: ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి

MLA Rakesh Reddy | రాంపూర్​ గ్రామాభివృద్ధికి కృషిచేస్తా: ఎమ్మెల్యే రాకేష్​రెడ్డి

ఆర్మూర్​ మండలంలోని ఆలూర్​ గ్రామాభివృద్ధికి డబుల్​లైన్​ రోడ్డు మంజూరైందని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి పేర్కొన్నారు. తనను కలిసేందుకు వచ్చిన రాంపూర్​ వీడీసీ సభ్యులతో ఆయన మంగళవారం మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : MLA Rakesh Reddy | ఆర్మూర్​ మండలంలోని రాంపూర్ గ్రామాభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి (MLA Rakesh Reddy )పేర్కొన్నారు. రాంపూర్​ వీడీసీ సభ్యులు మంగళవారం ఎమ్మెల్యేను మర్యాదపూరక్వంగా కలవగా ఆయన పైవిధంగా స్పందించారు.

MLA Rakesh Reddy | అభివృద్ధికి పనులకు నిధులివ్వండి..

రాంపూర్ (Rampur Village) చెరువు కట్ట మీదుగా మంథని రంగనాయకుల గుట్ట వరకు బీటీ రోడ్డు, మిర్ధపల్లి ఆలూరు మీదుగా మరొక లింక్ రోడ్డు, గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఐమాక్స్ లైట్లు (IMAX Lights) ఏర్పాటు చేయించాలని వీడీసీ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఆయన స్పందిస్తూ రాంపూర్ మీదుగా డబుల్​లైన్ మంజూరైందన్నారు. మిగిలిన రోడ్లు సైతం అతిత్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MLA Rakesh Reddy | రేషన్ దుకాణo పరిశీలన..

ఆర్మూర్ (Armoor) మండలం అంకాపూర్​లోని రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి పరిశీలించారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు సక్రమంగా అందించాలన్నారు. అయితేనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు.