అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prithviraj Chavan | కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan) సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలో (Venezuela) ట్రంప్ చర్యను ఎగ్జామ్‌పుల్‌గా చూపిస్తూ.. ప్రధాని మోదీపై (PM Modi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడు మదురోను ట్రంప్ (Donald Trump) బందీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. “ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తారా?” అని పృథ్వీరాజ్ చవాన్ ప్రశ్నించడం సంచలనంగా మారింది.
వెనుజులా సంక్షోభంపై ప్రధాని మోదీ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ నేత చవాన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి.. ఎన్నికైన అధ్యక్షుడిని అమెరికా తొలగించిందని.. అయినా భారత్ మౌనంగా ఉందంటూ విమర్శించారు. వెనుజులాలో జరుగుతున్న పరిణామాలు ‘ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధం’ అని పేర్కొన్నారు.
‘ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను (Venezuelan President Maduro) కిడ్నాప్ చేశారు. రేపు ఇతర దేశానికి కూడా ఇలా జరగవచ్చు.. రేపు భారత్‌కు కూడా ఇలాగే జరగవచ్చు’ అని వ్యాఖ్యానించారు. మదురోకు జరిగినట్లుగా భారత్‌కు జరుగుతుందా..? మిస్టర్ ట్రంప్ మన ప్రధానిని కిడ్నాప్ చేస్తారా.. అంటూ ప్రశ్నించారు.
చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇవి కేవలం ప్రధాని మోదీని కించపరచడమే కాకుండా, భారత ప్రజాస్వామ్యాన్ని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను అవమానించడమే అంటూ మండిపడింది. భారత్ ఓ అగ్రరాజ్యమని, వెనుజులా లాంటి దేశాలతో పోల్చడం అవివేకమని బీజేపీ నేతలు విమర్శించారు. కాగా.. చవాన్ వ్యాఖ్యలు అమెరికా దూకుడు ధోరణిని హెచ్చరించడానికి ఉద్దేశించినవని.. ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అనలేదని కాంగ్రెస్ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.