అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm modi) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. విజింజం అంతర్జాతీయ ఓడరేవు(Vizhinjam Port)ను జాతికి అంకితం చేశారు.
కార్యక్రమానికి స్థానిక ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Congress leader shashi tharoor) హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉండడం కొంతమందికి నిద్రకు భంగం కలిగిస్తుందన్నారు. శశిథరూర్(shashi tharoor) తన పక్కన కూర్చోవడం వల్ల కొందరికి నిద్ర పట్టదని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “ఈరోజు శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారు. నేటి కార్యక్రమం కొంతమంది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుకుంది.” ప్రధాని మోదీ(Pm Modi) అన్నారు.
Pm modi | థరూర్ అడుగులు ఎటువైపు..?
తిరువనంతపురం(Thiruvananthapuram) నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన థరూర్ గురించి ప్రధానమంత్రి నేరుగా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది రోజులుగా థరూర్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కేంద్ర చర్యలను సమర్థిస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేరళ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ(Pm modi)కి స్వాగతం పలికేందుకు థరూర్ హుటాహుటిన కేరళకు రావడం, ప్రధానితో వేదికను చర్చనీయాంశమైంది. వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయం “పనికిరాని” స్థితిలో ఉన్నప్పటికీ, విమానాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ, తిరువనంతపురం విమానాశ్రయంలో ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించడానికి సకాలంలో చేరుకున్నానని థరూర్ ట్వీట్ చేశారు.
Pm modi | పార్టీ మార్పు ఖాయమేనా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ అనుసరించిన విధానంతో పాటు కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంపై శశిథరూర్ కేంద్రంపై ప్రశంసలు కురిపించారు. కొద్ది రోజులుగా బీజేపీని పొగుడుతున్న థరూర్.. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వం(Congress leadership)పై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కేరళలో నాయకత్వ శూన్యత ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తన భవిష్యత్తు గురించి చర్చించడానికి రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సహా ఇటీవల కాంగ్రెస్ సీనియర్లతో సమావేశమయ్యారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ను వీడుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ప్రధాని మోదీ వెంట థరూర్ కూడా ఉండటం ఇప్పుడు కాంగ్రెస్‌తో పాటు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారింది.