ePaper
More
    HomeతెలంగాణCabinet Meeting | స్థానిక ఎన్నికలపై ప్రకటన వచ్చేనా.. కొనసాగుతున్న కేబినెట్​ మీటింగ్​

    Cabinet Meeting | స్థానిక ఎన్నికలపై ప్రకటన వచ్చేనా.. కొనసాగుతున్న కేబినెట్​ మీటింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cabinet Meeting | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో సెప్టెంబర్​ 30 లోపు పంచాయతీ ఎన్నికలు (Local Body Elections) నిర్వహించాలని హైకోర్టు (High Court) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

    Cabinet Meeting | స్టేటస్​ రిపోర్ట్​ మీటింగ్​

    ప్రతి మూడు నెలలకు ఒకసారి మంత్రివర్గ సమావేశాన్ని (Cabinet Meeting) స్టేటస్‌ రిపోర్ట్‌ మీటింగ్‌గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటివరకు 18 మంత్రిమండలి సమావేశాలు జరగ్గా.. 327 నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అవి ఎంతవరకు అమలు అయ్యాయనే అంశంపై నేటి సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు.

    READ ALSO  CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    Cabinet Meeting | రేషన్​కార్డుల పంపిణీపై..

    రాష్ట్రంలో ఈ నెల 14న కొత్త రేషన్​ కార్డుల (New Ration Cards) పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్​రెడ్డి 14న తుంగతుర్తి నియోజకవర్గం (Thungathurthi Constituency)లో కొత్త రేషన్​ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ విషయంపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులు, ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌ ఇచ్చిన నివేదికలు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ సవరణ చట్టం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this