Homeబిజినెస్​Airfloa Rail Technology | లిస్టింగ్‌ రోజే పెట్టుబడి డబుల్‌ అవ్వనుందా?.. ఆసక్తి రేపుతున్న ఎస్‌ఎంఈ...

Airfloa Rail Technology | లిస్టింగ్‌ రోజే పెట్టుబడి డబుల్‌ అవ్వనుందా?.. ఆసక్తి రేపుతున్న ఎస్‌ఎంఈ ఐపీవో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airfloa Rail Technology | స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. ఓ ఎస్‌ఎంఈ(SME) ఐపీవో మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. దీనికి జీఎంపీ(GMP) వందశాతానికిపైగా ఉండడమే ఇందుకు కారణం. అంటే లిస్టింగ్‌ రోజే ఐపీవో అలాట్‌ అయినవారి సంపద డబుల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న మాట.

ఎస్‌ఎంఈ విభాగానికి చెందిన ఎయిర్‌ఫ్లోవా రైల్‌ టెక్నాలజీ(Airfloa Rail Technology) లిమిటెడ్‌ను 1998 లో స్థాపించారు. ఇది ప్రధానంగా భారతీయ రైల్వే కోచ్‌ల తయారీకి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తోంది. ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, ఇతర కోచ్‌ ఫ్యాక్టరీలకు కోచ్‌లు, భాగాలను తయారుచేసి ఇస్తోంది. రైల్వే కోచ్‌లలో ఇంటీరియర్‌ పనులూ చేస్తుంది. ఇది శ్రీలంక డెమూ(డీఈఎంయూ), మెయిన్‌లైన్‌ కోచ్‌లు, ఆగ్రా -కాన్పూర్‌ మెట్రో, ఆర్‌ఆర్‌టీఎస్‌, విస్టాడోమ్‌ కోచ్‌లు, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) వంటి ప్రముఖ ప్రాజెక్టులకు సేవలందించింది. అలాగే విమానాలు, రక్షణ రంగానికి అవసరమైన భాగాల తయారీలోనూ ఈ కంపెనీ పనిచేస్తోంది. ఈ కంపెనీ రూ. 91.10 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. తాజా షేర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరిస్తోంది. ఐపీవో ద్వారా సేకరించిన మొత్తంలోనుంచి కంపెనీ మోటార్లు, పరికరాలు, యంత్రాంగాలను అభివృద్ధి చేసుకోవడానికి రూ. 13.68 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. కొన్ని అప్పులను తిరిగి చెల్లించడానికి రూ. 6 కోట్లు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకోసం రూ. 59.27 కోట్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకోసం మిగతా మొత్తాన్ని వినియోగించనున్నట్లు పేర్కొంది.

కంపెనీ షేర్లకు భారీ డిమాండ్‌..

ఎయిర్‌ఫ్లోవా రైల్‌ టెక్నాలజీ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. గ్రే మార్కెట్‌లో 118 శాతం ప్రీమియం(Premium)తో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌లో లిస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రైస్‌బాండ్‌..

కంపెనీ ధరల శ్రేణి(Price band)ని రూ. 133 నుంచి రూ. 140గా నిర్ణయించింది. ఒక లాట్‌లో వెయ్యి షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్‌ల కోసం రూ. 2.80 లక్షలతో బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 47.44 శాతం, ఎన్‌ఐఐలకు 14.29 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 33.26 శాతం, మార్కెట్‌ మేకర్స్‌ కోసం 5.01 శాతం షేర్లను రిజర్వ్‌ చేశారు. ఈ కంపెనీ షేర్లకు ఆదివారం జీఎంపీ 118 శాతంగా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారి సంపద తొలిరోజే రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ఈనెల 11న ప్రారంభమైంది. సోమవారంతో బిడ్డింగ్‌ గడువు ముగియనుంది. మంగళవారం రాత్రి షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 118న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ(BSE)లో లిస్టవనున్నాయి.

Must Read
Related News