ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | ఆరోగ్యాధికారి వచ్చేనా.. శానిటరీ విభాగంలో సగానికి పైగా ఔట్​సోర్సింగ్​ సిబ్బంది!

    Nizamabad | ఆరోగ్యాధికారి వచ్చేనా.. శానిటరీ విభాగంలో సగానికి పైగా ఔట్​సోర్సింగ్​ సిబ్బంది!

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad : వర్షాకాలం (monsoon season) వచ్చిందంటే వ్యాధుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. ప్రధానంగా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రంగా ఉండాలి. ఇలా ఉండాలంటే ప్రజలతోపాటు నగరపాలక సంస్థలోని ఎంహెచ్​వో (MHO).. శానిటరీ విభాగం ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుంది. కానీ, నిజామాబాద్ నగర పాలక సంస్థ(Nizamabad municipal corporation)లో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

    Nizamabad : వైద్యాధికారిని నియమించరే..

    నిజామాబాద్ బల్దియాలో ప్రధాన అధికారి కమిషనర్(commissioner). ఆ తర్వాత స్థానం డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ సిటీ ప్లానర్ వంటివి ప్రధానమైనవి. అయితే గత రెండు నెలలుగా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం ఆ రెండు పోస్టులను భర్తీ చేశారు. కానీ గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్న మున్సిపల్ వైద్యాధికారి పోస్ట్ మాత్రం భర్తీ చేయలేదు. ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే పోస్టును ఇన్​ఛార్జి బాధ్యతలు అప్పజెప్పారు.

    Nizamabad : ఇదీ పరిస్థితి..

    రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్​లలో నిజామాబాద్ ఒకటి. సుమారు నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు. ఇంత ప్రాచుర్యం ఉన్నా.. గత రెండేళ్లుగా ఎంహెచ్​వోను నియమించలేరు.

    బల్దియా పరిధిలో మొత్తం ఎనిమిది మంది శానిటరీ ఇన్​స్పెక్టర్​లు ఉన్నారు. ఇందులో రెగ్యులర్ ముగ్గురు కాగా.. అయిదుగురు ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ ఒకరికి శునకాల నియంత్రణ విభాగం, మరొకరికి డంపింగ్ యార్డు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదనే అపవాదు ఉంది.

    Nizamabad : వర్షాకాలం ఇబ్బందులు..

    ప్రజారోగ్యాన్ని కాపాడడం, ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రంగా ఉంచడం, మురుగునీటి వ్యవస్థను నిర్వహించడం, వ్యాధుల వ్యాప్తిని నివారించడం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ప్రధాన విధి. అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అలాగే హోటళ్లు, కల్తీ ఆహారం, తినుబండారాలపై నియంత్రణను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ, నగరంలో ఇలాంటి తనిఖీలు చేపట్టిన దాఖలాలు తక్కువగానే ఉన్నాయి. ఒకటి, రెండుసార్లు జరిమానా విధించి చేతులు దులిపేసుకుంటున్నారు. రెగ్యులర్ అధికారి ఉండి, నిత్య పర్యవేక్షణ ఉంటేనే కల్తీ ఆహారాన్ని నివారించే అవకాశం ఉంటుంది. దీనికితోడు కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది.

    బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సిందే

    ఎంహెచ్​వో పోస్టు కోసం ఇప్పటికే సీడీఎంఏకు లేఖ రాశాం. ప్రజారోగ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత. రెగ్యులర్, ఔట్​సోర్సింగ్​ సిబ్బంది ఎవరైనా విధులను సక్రమంగా నిర్వహించాల్సిందే. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. – దిలీప్ కుమార్, కమిషనర్

    Latest articles

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...

    Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి...

    More like this

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...