ePaper
More
    HomeజాతీయంVice President | ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా.. ప్రయత్నాలు ప్రారంభించిన ఎన్డీఏ

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా.. ప్రయత్నాలు ప్రారంభించిన ఎన్డీఏ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార ఎన్డీఏ కూటమి భావిస్తోంది. జగదీప్​ ధన్​ఖడ్(Jagdeep Dhankhar)​ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

    ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సెప్టెంబర్​ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బీజేపీ సీనియర్​ నాయకుడు, మహారాష్ట్ర గవర్నర్​ సీపీ రాధాకృష్ణన్(Maharashtra Governor CP Radhakrishnan) ఖరారు చేసిన విషయం తెలిసిందే.

    ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక(Vice President Election)కు కావాల్సిన బలం ఎన్డీఏకు ఉంది. అయితే విపక్ష కూటమి అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎలాగు అధికార కూటమి గెలుస్తుంది కాబట్టి.. ఏకగ్రీవంగా ఎన్నిక చేపట్టాలని బీజేపీ(BJP) భావిస్తోంది. ఆర్​ఎస్​ఎస్​ నేపథ్యం ఉన్న సీపీ రాధాకృష్ణన్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చూస్తోంది. ఈ మేరకు పార్లమెంట్‌లో రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించారు. జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌, అశ్విని వైష్ణవ్‌, శివరాజ్‌సింగ్, భూపేంద్రయాదవ్‌ పాల్గొన్నారు.

    Vice President | ఖర్గేతో మాట్టాడిన రాజ్​నాథ్​సింగ్

    ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి విపక్ష పార్టీలతో ఏన్డీఏ నేతలు మాట్లాడనున్నారు. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్(Defence Minister Rajnath Singh)​ కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge)తో ఫోన్​లో మాట్లాడారు. వైస్​ ప్రెసిడెంట్​ ఎన్నికకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

    Vice President | ఇండియా కూటమి నేతల భేటీ

    పార్టమెంట్​లో ఇండియా కూటమి నేతలు సైతం భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నేతలు చర్చిస్తున్నారు.ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా, అభ్యర్థిని పోటీలో ఉంచాలా అనే విషయంపై మంతనాలు చేస్తున్నారు. సీపీ రాధాకృష్ణన్​ తమిళనాడుకు చెందిన వ్యక్తి. దీంతో డీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు.

    Vice President | ఎవరి బలం ఎంతంటే..

    ఉప రాష్ట్ర‌ప‌తిని రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ స‌భ్యులు క‌లిసి ఎన్నుకుంటారు. నామినేట్ చేయబడిన వారితో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు. ఉభయ సభల్లో మొత్తం 782 మంది స‌భ్యులు ఉండ‌గా, ఉప రాష్ట్ర‌ప‌తిగా గెల‌వాలంటే 392 ఓట్లు రావాలి.
    లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు ఉండగా, విప‌క్ష కూట‌మికి 234 మంది సభ్యులు ఉన్నారు. రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకు 130 మంది స‌భ్యులు ఉండ‌గా, ఇండి బ్లాక్‌కు 79 మంది సభ్యుల మద్దతు మాత్ర‌మే ఉంది. అధికార ఎన్డీయే కూటమికి మొత్తం 423 మంది ఎంపీలు ఉండటంతో సులువుగా గెలుస్తుంది. అయితే ఏకగ్రీవం చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

    Latest articles

    Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న...

    Rajasthan | బ్లూ డ్రమ్‌లో కుళ్లిన భ‌ర్త డెడ్ బాడీ.. భార్య‌, పిల్ల‌లు మిస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | మరోసారి బ్లూ డ్రమ్‌లో శవం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా(Alwar...

    Lok Sabha Speaker | నినాదాలు ఆపండి.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నించండి.. లోక్‌స‌భ‌లో ఎంపీల ఆందోళ‌నపై స్పీక‌ర్ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lok Sabha Speaker | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. సోమ‌వారం...

    Toll Gate | ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది.. వైర‌ల్‌గా మారిన వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Gate | టోల్‌ప్లాజా వ‌ద్ద ఆల‌స్యం జ‌రుగుతుండడాన్ని ప్ర‌శ్నించిన ఆర్మీ జ‌వానుపై (Army...

    More like this

    Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న...

    Rajasthan | బ్లూ డ్రమ్‌లో కుళ్లిన భ‌ర్త డెడ్ బాడీ.. భార్య‌, పిల్ల‌లు మిస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | మరోసారి బ్లూ డ్రమ్‌లో శవం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా(Alwar...

    Lok Sabha Speaker | నినాదాలు ఆపండి.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌శ్నించండి.. లోక్‌స‌భ‌లో ఎంపీల ఆందోళ‌నపై స్పీక‌ర్ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lok Sabha Speaker | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. సోమ‌వారం...