అక్షరటుడే, వెబ్‌డెస్క్ : State Politics | రాష్ట్ర రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల రణరంగాన్ని తలపిస్తున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం అధికార, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా బీజేపీ BJP వైఖరి మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వంలో కీలక మార్పులు ఖాయమని కమల నాథులు BJP Leaders చెబుతుండడం కాంగ్రెస్ congress పార్టీలోనూ కలవరం రేపుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి cheif Minister మార్పు ఖాయమని, సీఎంగా కేసీఆర్ KCR అవుతారని చెబుతుండడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. మొన్న బీజేపీ సీనియర్ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ NVSS Prabhakar, తాజాగా బీజేపీ శాసనసభాక్ష నేత మహేశ్వర్‌రెడ్డి Maheshwar Reddy చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.
State Politics | కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరతారా?
ముఖ్యమంత్రి మార్పు ఖాయమని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మర్మం ఎవరికీ అంతు బట్టడం లేదు. అందులో వాస్తమున్నా, లేకున్నా సీఎం మార్పు ఖాయమన్న ప్రచారాన్ని వారు బలంగా తెరపైకి తెస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారడం ఖాయం.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం అని బీజేపీ నాయకులు కొద్దిరోజులుగా వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. జూన్ లేదా డిసెంబర్ మాసంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని చెప్పారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తప్పిస్తుందన్నారు. కేసీఆర్ తన బీఆర్ఎస్ BRS పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఇదే అంశాన్ని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి ప్రస్తావించారు. రేవంత్ తప్పులన్నీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉన్నాయని, లోకల్‌బాడీ ఎన్నికల Local Body Elections తర్వాత సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఎదురుచూస్తోందని వెల్లడించారు. మొత్తానికి సీఎం మార్పు అంశాన్ని మాత్రం బీజేపీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
State Politics | వెనుకబడిన బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు కృషి చేస్తున్నాయి. అయితే, కొత్త కొత్త అంశాలను, పొలిటికల్ మైలేజ్ దక్కే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ కంటే బీజేపీ కాస్త ముందుంది. సీఎం మార్పు అంశాన్ని రెండు పార్టీలు ఎత్తుకున్నప్పటికీ, బీజేపీ తీసుకెళ్లినంత బలంగా గులాబీ పార్టీ తీసుకెళ్లలేక పోయింది. ఢిల్లీకి కప్పం కడుతున్న రేవంత్‌రెడ్డిని దించేయడం ఖాయమని, ఆయనను సొంత పార్టీ నేతలే కుర్చీ నుంచి దించేస్తారని కేటీఆర్ KTR, హరీశ్‌రావు Harish Rao వంటి వారు అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తున్నా అవి పెద్దగా జనంలోకి వెళ్లడం లేదు. బలమైన సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న గులాబీ పార్టీ.. సీఎం మార్పు అంశంపై కాకుండా కేసీఆర్, అప్పటి పథకాలపైనే ఫోకస్ చేస్తోంది.
State Politics | బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీయా?
బీజేపీ రాజకీయ స్ట్రాటజీ ఎప్పుడూ ఎవరికీ అంతుబట్టదు. మోదీ, అమిత్ షా వచ్చాక కమలనాథుల ఎత్తుగడలు తుత్తునీయలు చేయడం దాదాపు అసాధ్యంగా మారింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. అంతటి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగే బీజేపీ.. రాష్ట్రంలో అనుసరిస్తున్న రాజకీయ వైఖరి ఎవరికి అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో సమ దూరం పాటించే కాషాయదళం.. ఆ రెండు పార్టీలు కలిసి పోతాయని చెప్పడం వెనుక పొలిటికల్ మైలేజ్ పొందాలనే ఎత్తుగడ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
