అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని (CM Revanth Reddy) కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సైన్యంపై రేవంత్‌రెడ్డి నీచమైన కామెంట్స్ చేశారని మండిపడిన కేటీఆర్.. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills election) ప్రచారంలో భాగంగా రెండ్రోజుల క్రితం ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి సైన్యాన్ని కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వాళ్లు ముడ్డి తంతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఉదయం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
KTR | రాజకీయ లబ్ధి కించపరుస్తారా?
రాజకీయ ప్రయోజనాల కోసం సైన్యాన్ని కించపరచడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఇండియన్ ఆర్మీపై రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చేసిన నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు. మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే మనం సురక్షితంగా ఉంటూ..
రాజకీయాలు (Politics) చేయగలుగుతున్నామన్న విషయం గుర్తుచ్చుకోవాలని ముఖ్యమంత్రికి హితవు పలికారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే మనం సురక్షితంగా ఉంటూ, రాజకీయాలు చేసుకోగలుగుతున్నామని హితవు పలిచారు. ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడుపుతూ కుటుంబాలతో జీవించగలుగుతున్నామని చెప్పారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డికి సరికాదన్నారు.
KTR | పాకిస్తాన్‌ను పొడుగుతారా?
ఎన్నికల ప్రచారంలో (election campaign) రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. మన సైన్యాన్ని అవమానిస్తూ పాకిస్తాన్ ను పొడుగుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల లబ్ధికోసం ఆర్మీపై కామెంట్స్ చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నారని విమర్శించారు. మీరు భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారని ప్రశ్నించారు. మీరు భారత సైన్యానికి క్షమాపణ చెప్పి, మీ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బు సంచులతో దొరికిన రేవంత్‌రెడ్డికి గుండాలు, రౌడీషీటర్లు అంటేనే గౌరవం.. అలాంటి రేవంత్‌కు శత్రుదేశాన్ని గౌరవించడంలో ఆశ్చర్యమేమీ లేదని చెప్పారు. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలని, తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైన మర్యాదగా ప్రవర్తించాలని కేటీఆర్ సూచించారు.
