- Advertisement -
Homeబిజినెస్​Seshaasai Technologies IPO | ‘శేషశాయి’ కాసుల వర్షం కురిపించేనా..? రేపటి నుంచి మరో ఐపీవో

Seshaasai Technologies IPO | ‘శేషశాయి’ కాసుల వర్షం కురిపించేనా..? రేపటి నుంచి మరో ఐపీవో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Seshaasai Technologies IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి మరో ఐపీవో(IPO) వస్తోంది. మంగళవారం ప్రారంభమై గురువారం వరకు కొనసాగనుంది. కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) 27 శాతం ఉండడంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.

శేషశాయి టెక్నాలజీస్‌ (Seshaasai Technologies) సంస్థను 1985లో స్థాపించారు. 1990లలో ప్రైవేట్‌ బ్యాంకులకు ప్రింట్‌ స్టేషనరీ సరఫరాదారుగా ప్రారంభమైన కంపెనీ ప్రస్థానం 2000ల ప్రారంభంలో ప్రభుత్వ డేటా యొక్క విశ్వసనీయ సంరక్షకుడిగా కంపెనీ మారింది. ప్రస్తుతం ఇది అధునాతన సాంకేతికతలతో పరిశ్రమలలో డిజిటల్‌ పరివర్తనను నడిపిస్తోంది. ఇది బ్యాంకింగ్‌(Banking), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం కోసం పేమెంట్‌, కమ్యూనికేషన్‌, ఫుల్‌ఫిల్‌మెంట్‌, ఎల్‌వోటీ సొల్యూషన్స్‌ అందిస్తోంది. క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, ప్రీపెయిడ్‌ కార్డులు, చెక్కులు, మాస్‌ ట్రాన్సిట్‌ కార్డులు వంటి పేమెంట్‌ పరికరాలను, బీమా పత్రాలు, యుటిలిటీ బిల్లులు వంటి సురక్షితమైన కమ్యూనికేషన్‌ సేవలను అందిస్తోంది. ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, లేబుల్‌లను తయారు చేస్తుంది.

- Advertisement -

అలాగే ఆర్‌ఎఫ్‌ఐడీ ఆటోమేషన్‌, మిడిల్‌వేర్‌ను అందిస్తోంది. ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 813.07 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఫ్రెష్‌ ఇష్యూతో 1.13 కోట్ల షేర్ల జారీ ద్వారా రూ. 480 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 0.79 కోట్ల షేర్ల జారీతో 333.07 కోట్లు సమీకరిస్తారు. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రస్తుత తయారీ యూనిట్ల విస్తరణకు అవసరమైన మూలధన వ్యయం కోసం, రుణాలను తిరిగి చెల్లించడం కోసం, ఇతర సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలకోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రైస్‌ బాండ్‌ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 402 నుంచి రూ. 423 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 35 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌ కోసం రూ. 14,805తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల(Retail Investors)కు 35 శాతం కోటా కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఒక్కో ఈక్విటీ షేరు రూ. 115 ప్రీమియంతో ట్రేడ్‌ అవుతోంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 27 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కంపెనీ పనితీరు : 2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1,569.67 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించగా.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,473.62 కోట్లు ఆర్జించింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం(Net profit) మాత్రం రూ. 169.64 కోట్లనుంచి రూ. 222.32 కోట్లకు పెరిగింది. ఆస్తులు రూ. 958.61 కోట్లనుంచి రూ. 1,160.39 కోట్లకు చేరాయి.

ముఖ్యమైన తేదీలు..

ఐపీవో ప్రారంభ తేదీ : సెప్టెంబర్‌ 23.
ముగింపు తేదీ : సెప్టెంబర్‌ 25.
అలాట్‌మెంట్‌ : సెప్టెంబర్‌ 26 రాత్రి.
లిస్టింగ్‌ తేదీ : సెప్టెంబర్‌ 30. (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతుంది)

- Advertisement -
- Advertisement -
Must Read
Related News