అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
కవిత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పరోక్షంగా కేటీఆర్(KTR), సంతోష్‌రావు(Santosh Rao)పై వ్యాఖ్యలు చేసిన ఆమె.. సోమవారం కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు, సంతోష్‌రావుకు భాగం ఉందని బాంబ్ పేల్చారు. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతుందని భావించినా పార్టీ సస్పెండ్(Party Suspended) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కవిత తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆమె ఆలోచిస్తున్నట్లు సమాచారం.
MLC Kavitha | పార్టీతో తెగదింపులు
కవిత(MLC Kavitha) ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ జాగృతిని అభివద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తనను సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్సీ పదవిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయకముందే పదవి వదులుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీతో పూర్తిగా తెగదింపులు చేసుకోవడానికి ఆమె సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆమె సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారు. మరి కొద్ది సేపట్లో కవిత మీడియా ముందుకు వచ్చి తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
MLC Kavitha | జాగృతి కార్యాలయానికి కార్యకర్తలు
జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి(Jagruti Office) కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడంతో వారు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవిత సస్పెన్షన్‌తో జరిగేది ఏమీలేదని వారు పేర్కొన్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ (CBI Investigation)ను కవిత తట్టుకోలేక వ్యాఖ్యలు చేశారన్నారు. చాలా రోజులుగా ఆమెను దూరంపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని జాగృతి కార్యకర్తలు పేర్కొన్నారు.