అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | 2025 జూన్ 2.. రాష్ట్ర రాజకీయాల్లో (state politics) కీలకంగా మారనుందా? ఆ రోజున కొత్త పార్టీ (new party) రాబోతుందా? ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ పార్టీలో పుట్టిన ఆధిపత్య పోరు నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తుపై బీఆర్ఎస్ అధినేత, తండ్రి కేసీఆర్ (KCR) నుంచి స్పష్టత రాకపోవడంతో ఆమె సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు జూన్ 2 (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) తేదీని ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలిసింది. మంగళవారం కొంత మంది నాయకులతో పాటు సింగరేణికి చెందిన కార్మిక నేతలు (Singareni labor leaders), ఇతర ముఖ్యులతో సమావేశమైన ఆమె ఇదే అంశంపై చర్చించినట్లు సమాచారం.
MLC Kavitha | ఊహాగానాలెన్నో..
బీఆర్ఎస్ పార్టీతో (BRS party) దూరంగా ఉంటున్న కవిత.. సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో (Telangana political circles) జోరందుకున్నాయి. తిరుగుబావుట ఎగురవేసిన ఆమెకు సర్దిచెప్పేందుకు కేసీఆర్ (KCR) పంపిన రాయబారం విఫలమైందని తెలిసింది. బీఆర్ఎస్ రాజ్యససభ సభ్యుడు దామోదరరావుతో (BRS Rajya Sabha member Damodar Rao) పాటు పార్టీ లీగల్ సెల్ ఇంచార్జ్ గండ్ర మోహనరావు (legal cell in-charge Gandra Mohan Rao) సోమవారం కవితతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
కవితను బుజ్జగించేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. పార్టీలో తన పాత్రతో పాటు భవిష్యత్తుపై స్పష్టత కావాలని ఆమె కోరినట్లు సమాచారం. అయితే, దీనిపై అధినేత నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఆమె తన రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త పార్టీ పెట్టేందుకే సిద్ధమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. జూన్ 2వ తేదీని అందుకు ముహూర్తంగా నిర్ణయించినట్లు పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
MLC Kavitha | మెదక్ ఎంపీ చెప్పింది నిజమేనా?
కవిత వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తండ్రి, కుమార్తెల మధ్య మధ్యవర్తులెందుకు? అని ఆయన ప్రశ్నించారు.
“జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర కూడా చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ (KCR) దేవుడయ్యారని.. మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారంటూ ఎంపీ రఘునందన్ సందేహం వ్యక్తం చేశారు. దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకు? చేసినట్లు అని ప్రశ్నించారు.”
తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకుంటే.. బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరుపై గతంలో బీజేపీ నేతలు (BJP leaders) చేసిన వ్యాఖ్యలు నిజం కావడమే అందుకు నిదర్శనం. కవిత లేఖ బయటకు రావడానికి కనీసం పది రోజుల ముందే.. ఆమె తన తండ్రికి ఘాటైన లేఖ రాసిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి (BJP MLA Maheshwar Reddy) చెప్పడాన్ని బట్టి.. కాషాయ పార్టీకి కచ్చితమైన సమాచారం ఉందన్నది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో రఘునందన్‌రావు వ్యాఖ్యలు కూడా వాస్తవరూపం దాలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది.