అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jaro Institute IPO | ఉన్నత విద్య రంగంలో సేవలందిస్తున్న జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్(Jaro Institute of Technology Management & Research) కంపెనీ ఐపీవోకు వచ్చింది. కంపెనీ సబ్‌స్క్రిప్షన్(Subscription) మంగళవారంనుంచి గురువారం వరకు కొనసాగనుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 13 శాతంగా ఉంది.
జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (జారో ఎడ్యుకేషన్) ఆన్‌లైన్(Online) ఉన్నత విద్య మరియు ఎగ్జిక్యూటివ్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ భారతీయ ఎడ్‌టెక్ కంపెనీ(Indian Edtech Company). దీనిని 2009లో స్థాపించారు. ఇది డీబీఏ, ఎంబీఏ, ఎంకామ్, ఎంఏ, పీడీడీఈఎం, ఎంసీఏ, ఎమ్మెస్సీ, బీకాం, బీసీఏ వంటి విస్తృత శ్రేణి ఆన్‌లైన్ డిగ్రీ ప్రోగ్రామ్‌లతో పాటు క్రాస్ డిసిప్లినరీ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తోంది. ఈ కంపెనీ ఆఫ్‌లైన్ లర్నింగ్ కోసం ప్రధాన నగరాల్లో 22 కిపైగా కార్యాలయాలు కమ్ లర్నింగ్ సెంటర్‌లతో పాటు వివిధ ఐఐఎం క్యాంపస్‌లలో ఉన్న 17 ఇమ్మర్సివ్ టెక్ స్టూడియో సెటప్‌లతో దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉంది.
7 ఐఐఎంలు, 6 ఐఐటీలతోపాటు టొరంటో విశ్వవిద్యాలయంలోని రోట్‌మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహా 36 సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. నిర్వహణ, సాంకేతికత మరియు విశ్లేషణ డొమైన్‌లలో 250 కిపైగా ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఈ కంపెనీ రూ. 450 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో(IPO)కు వచ్చింది. ఇందులో ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 170 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 280 కోట్లు సమీకరించనుంది.ఐపీవో ద్వారా వచ్చిన మొత్తంలోంచి రూ. 81 కోట్లు మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ మరియు ప్రకటనల కార్యకలాపాలకోసం, రూ. 45 కోట్లు కంపెనీ తీసుకున్న రుణాలలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడం కోసం, మిగిలిన మొత్తాన్ని ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకోసం వినియోగించనున్నారు.
ప్రైస్‌బాండ్ : ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 846 నుంచి రూ. 890గా నిర్ణయించింది. ఒక లాట్(Lot)లో 16 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసo ఒక లాట్ కోసం రూ. 14,240తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల(Retail investors)కు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 122 గా ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 13 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు : ఐపీవో 23న ప్రారంభమై 25 వరకు అందుబాటులో ఉంటుంది. షేర్ల అలాట్‌మెంట్ 26న రాత్రి జరగనుంది. కంపెనీ షేర్లు ఈనెల 30న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.