అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | గ్లోబల్ మార్కెట్లు (Global markets) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నాయి.
అయితే గత నాలుగు సెషన్లుగా ప్రధాన సూచీలు భారీ గ్యాప్‌అప్‌లో ప్రారంభమవుతున్నా.. చివరలో నిలదొక్కుకోలేకపోతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 342 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 91 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. గత సేషన్లలాగే ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్(Profit booking) జరుగుతుండడంతో సూచీలు వెనక్కి వస్తున్నాయి. సెన్సెక్స్ 80,928 నుంచి 81,162 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,814 నుంచి 24,879 పాయింట్ల మధ్యలో సాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 234 పాయింట్ల లాభంతో 81,022 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 24,845 వద్ద ఉన్నాయి.
Stock Market | ఐటీలో జోరు
నాస్‌డాక్ ర్యాలీ, ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆలోచనల నేపథ్యంలో ఐటీ ఇండెక్స్(IT index) పరుగులు తీస్తోంది. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 2.49 శాతం పెరగ్గా.. హెల్త్‌కేర్ 0.405 శాతం, ఇన్‌ఫ్రా 0.32 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.27 శాతం లాభాలతో ఉన్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.28 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.26 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.17 శాతం నష్టంతో సాగుతున్నాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.14 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ 4.74 శాతం, టెక్ మహీంద్రా 2.08 శాతం, అదానీ పోర్ట్స్ 1.44 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.37 శాతం, టీసీఎస్ 1.11 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 1.17 శాతం, ట్రెంట్ 1.0 శాతం, టైటాన్ 0.80 శాతం, టాటా మోటార్స్ 0.56 శాతం, రిలయన్స్ 0.32 శాతం నష్టంతో ఉన్నాయి.