Homeబిజినెస్​IPO | ‘కల్పతరు’వయ్యేనా..? రేపటి నుంచి మరో ఐపీవో ప్రారంభం

IPO | ‘కల్పతరు’వయ్యేనా..? రేపటి నుంచి మరో ఐపీవో ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPO | ముంబయి(Mumbai)కి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ అయిన కల్పతరు (Kalpataru) లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. మంగళవారం సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది.

ముంబయికి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ అయిన కల్పతరు లిమిటెడ్(Kalpataru ltd) నివాస, వాణిజ్య ఆస్తి విభాగాలలో మూడు దశాబ్దాలకుపైగా సేవలందిస్తోంది. ఇది మహారాష్ట్ర(Maharashtra) అంతటా ముఖ్యంగా ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతం, పుణెలో అనేక ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం 500 ఎకరాలకు పైగా భూమి అభివృద్ధి వివిధ దశలలో ఉంది. ఈ కంపెనీ ఐపీవో(IPO) ద్వారా రూ. 1,590 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ. 10 ముఖ విలువ కలిగిన 3.84 కోట్ల తాజా షేర్లను ఇష్యూ చేయనుంది.

IPO | ముఖ్యమైన తేదీలు..

ఐపీవో మంగళవారం ప్రారంభం కానుంది. గురువారం వరకు సబ్‌స్క్రిప్షన్‌(Subscription) స్వీకరిస్తారు. శుక్రవారం రాత్రి ఐపీవో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు వచ్చే నెల ఒకటో తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి.

IPO | ధరల శ్రేణి..

కంపెనీ ధరల శ్రేణి(Price band)ని ఒక్కో షేరుకు రూ. 387 నుంచి రూ. 414 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 36 షేర్లుంటాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,904తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

IPO | కోటా..

మొత్తం ఆఫర్‌లో 75 శాతం కోటాను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (QIB)కు, 15 శాతం సంస్థాగతేతర పెట్టుబడిదారుల (NII)కు, 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించారు.

IPO | జీఎంపీ..

ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 10గా ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు 2 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.