Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | ఆర్వోబీలకు నిధులు విడుదల చేయకుంటే నిరాహార దీక్ష చేస్తా : ఎంపీ...

MP Arvind | ఆర్వోబీలకు నిధులు విడుదల చేయకుంటే నిరాహార దీక్ష చేస్తా : ఎంపీ అర్వింద్​

MP Arvind | జిల్లాలోని ఆర్వోబీలకు నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ అర్వింద్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : MP Arvind | జిల్లాలోని ఆర్వోబీలకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని ఎంపీ ధర్మపురి అర్వింద్​ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జిల్లాలోని అడవి మామిడిపల్లి ఆర్వోబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. అయితే గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. అలాగే మాధవ్ నగర్ ఆర్వోబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.

MP Arvind | అధికారులు బాధ్యతను నిర్వర్తించాలి

బిల్లులకు సంబంధించి జిల్లా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఎంపీ (MP Arvind)సూచించారు. రెండు నెలల క్రితం కలెక్టర్​తో సమీక్ష నిర్వహించినా ఇప్పటివరకు ఇలాంటి పురోగతి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోసం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

MP Arvind | పీసీసీ చీఫ్​కు సబ్జెక్ట్ తెలియదు

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​ (PCC Cheif Mahesh Kumar Goud)కు ఆర్వోబీ నిధులపై సరైన అవగాహన లేదని ఎంపీ విమర్శించారు. ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కేంద్ర నిధులే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై బురద జల్లి బీఆర్ఎస్​ను కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా.. ఏమి చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లతో పాటు దొంగ పాస్పోర్టులు చేశారన్నారు. ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అయ్యేది జూబ్లీహిల్స్ లోనే అని, లోకల్ నాయకులను కాపాడింది కేటీఆర్ (KTR)అని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా లేక ఇస్తే ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు.

దేశభద్రతకు కల్వకుంట్ల కుటుంబం పెద్ద ముప్పు అని విమర్శించారు. సమావేశంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంచర్ల లక్ష్మీనారాయణ నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.