అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Disqualification Petition | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ ముగిసింది. ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అనర్హత పిటిషన్‌పై చాలా కాలంగా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల స్పీకర్ ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. నోటీసుల మేరకు శుక్రవారం అసెంబ్లీ హాల్లో దానం తరఫు న్యాయవాదులు, బీఆర్ఎస్ న్యాయవాదులను స్పీకర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కాగా స్పీకర్ నోటీసులపై అఫిడవిట్ సమర్పించిన దానం తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదన్నారు. వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు చెప్పారు.
Disqualification Petition | బీజీపీ పిటిషన్‌పై..
దానం నాగేందర్ అనర్హతపై బీజేపీ సైతం పిటిషన్ వేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (BJP MLA Eleti Maheshwar Reddy) పిటిషన్ వేశారు. దీనిపై విచారణ పూర్తి కాలేదు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలని ఆయన కోరారు. దీంతో వచ్చే నెల 18న విచారణకు అవకాశం ఇచ్చారు. బీజేపీ పిటిషన్‌పై విచారణ పూర్తయిన తర్వాత దానం నాగేందర్‌పై స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడంతో వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ సాంకేతిక కారణాలతో స్పీకర్ వేటు వేయకపోతే.. సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లాలని నిర్ణయించుకుంది.
Disqualification Petition | ఆ రెండు పార్టీలు ఒకటే..
దానం నాగేందర్ మీద బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేసి విచారణకు హాజరు కాలేదని కౌశిక్‌రెడ్డి అన్నారు. విచారణ అనంతరం ఆయన అసెంబ్లీ వద్ద మాట్లాడరు. బీజేపీ ఎమ్మెల్యే హాజరు అవ్వకుండా మాకు మరొక డేట్ ఇవ్వండని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంట్లో బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ క్లియర్‌గా కనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది అందరూ చూశారన్నారు.