అక్షరటుడే, వెబ్‌డెస్క్:Eatala Rajendar | కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణకు హాజరవుతానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు(Former MLA Harish Rao), ఈటల రాజేందర్‌కు నోటీసులిచ్చింది. బీఆర్ఎస్ హయాంలో తొలి విడతలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలో జూన్ 9న విచారణకు హాజరు కావాలని ఈటలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన ఆయన విచారణకు హాజరు అవుతానని తెలిపారు.
Eatala Rajendar | బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారు
బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఈటల ఎద్దేవా చేశారు. కాగా.. తాను ఇటీవల హరీశ్‌రావును కలిశానని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌గౌడ్(PCC President Bomma Mahesh Goud) చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను ఎవరినీ కలవలేదని స్పష్టం చేశారు. ఎవరో ఇస్తే తెలంగాణ రాలేదని ఈ సందర్భంగా ఈటల అన్నారు. ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఏర్పడిందన్నారు. గత పాలనలో ఒక కుంటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని విమర్శించారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని ఈటల అన్నారు. ప్రజల ఆశలను అడియాసలు చేసిన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు దిక్సూచి బీజేపీ(BJP) అని ఆయన పేర్కొన్నారు.