ePaper
More
    HomeతెలంగాణKonda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    Konda Murali | కొండా దంపతులపై చర్యలుంటాయా.. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన మురళి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Murali | ఉమ్మడి వరంగల్​ జిల్లా కాంగ్రెస్​లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ దంపతులు, మిగతా కాంగ్రెస్​ ఎమ్మెల్యే(Congress MLA)లకు మధ్య పొసగడం లేదు. వారి మధ్య కొంతకాలంగా కోల్డ్​ వారు జరుగుతుండగా ఇటీవల కొండా మురళి వ్యాఖ్యలతో అది కాస్తా బయట పడింది. దీంతో ఆయనపై కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

    Konda Murali | వివాదాస్పద వ్యాఖ్యలు

    ఇటీవల కొండా మురళి(Konda Murali) కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్​రెడ్డి(Revuri Prakash Reddy)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ఎన్నికల ముందు తన కాళ్లు పట్టుకున్నారన్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సైతం కడియం నల్లికుట్ల మనిషని, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి భద్రకాళి ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

    Konda Murali | మీనాక్షి నటరాజన్​కు ఫిర్యాదు

    కొండా దంపతుల తీరుపై ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇటీవల సమావేశం అయ్యారు. అనంతరం వారిపై కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​(Meenakshi Natarajan)కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని కమిటీ ఇదివరకే కొండా మురళికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన గాంధీభవన్​(Gandhi Bhavan)లో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యారు. మురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడిన కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా.. మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.

    More like this

    Vice President Election | ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధం ఎన్డీయే గెలుపు లాంఛ‌న‌మే.. కానీ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో...

    Urban Company IPO | ఐపీవోకు అర్బన్‌ కంపెనీ.. బుధవారంనుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urban Company IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీవో(IPO)ల సందడి కొనసాగుతోంది. మొబైల్‌...

    E-Commerce | పండుగ స్పెషల్‌.. ఇ-కామర్స్‌లో ఉద్యోగాల జాతర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : E-Commerce | దసరా పండుగ సమీపిస్తోంది. షాపింగ్‌ సందడి పెరగనుంది. పండుగ సీజన్‌ను సొమ్ము...