HomeUncategorizedTirumala | తిరుమలలో వన్యప్రాణుల సంచారం.. టీటీడీ కీలక నిర్ణయం

Tirumala | తిరుమలలో వన్యప్రాణుల సంచారం.. టీటీడీ కీలక నిర్ణయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల(Tirumala)లో ఇటీవల వన్యప్రాణుల సంచారం పెరిగింది. ఈ క్రమంలో అధికారులు మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు.

తిరుమలలోని అలిపిరి మెట్లమార్గం (Alipiri Steps), ఘాట్ రోడ్డుల వద్ద ఇటీవల కాలంలో వన్యమృగాలు, చిరుతపులుల కదలికలు పెరిగాయి. దీంతో మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై మంగళవారం గోకులం స‌మావేశ మందిరంలో ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో (TTD EO Shyamala Rao) శ్యామలరావు వర్చువల్​గా సమావేశం నిర్వహించారు.

Tirumala | భద్రత పెంపునకు నిర్ణయం

వన్యప్రాణుల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ⁠అలిపిరి మెట్ల మార్గంలో అద‌న‌పు సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించారు. ⁠ఎప్ప‌టిక‌ప్పుడు ఆరోగ్య‌శాఖ ద్వారా చెత్త‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు చేపట్టనున్నారు. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో న‌డ‌క‌మార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్ నిర్వహించునున్నారు.

⁠అలిపిరి మార్గాన్ని “చిరుత రహిత ప్రాంతంగా” మార్చేందుకు కెమెరా ట్రాపులు, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగ్, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు తదితర రక్షణ పరికరాల వినియోగించాలని సమావేశంలో నిర్ణయించారు. నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు అవగాహన కల్పించనున్నారు.