అక్షరటుడే, వెబ్‌డెస్క్: Wildfire in Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ లోయలోని అడవులలో కార్చిచ్చు వ్యాపించింది. దీంతో భారత వైమానిక దళం (IAF) సముద్ర మట్టానికి దాదాపు 9,500 అడుగుల ఎత్తులో మండుతున్న మంటలపై Mi-17V5 హెలికాప్టర్ల నుంచి 12 వేల లీటర్ల నీటిని జారవిడిచింది.
లోహిత్ నది (Lohit River)కి ఎదురుగా ఉన్న నిటారుగా, ప్రవేశించలేని గట్ల మీదుగా పనిచేస్తున్న వైమానిక దళ సిబ్బంది మంటల వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. ఈ మంటలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వాయసేన (Air Force) మంటలను ఆర్పి వేసింది. ఆ ప్రాంతంలో మంటలు ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది వెళ్లలేకపోయారు. కఠినమైన పరిస్థితులు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) వాయసేనను అభ్యర్థించింది.
Wildfire in Arunachal Pradesh | మరింత వ్యాపించకుండా..
తూర్పు సెక్టార్ నుంచి వచ్చిన దళాలతో సహా భారత సైన్యం (Indian Army) యూనిట్లు, రాష్ట్ర అటవీ అధికారులతో కలిసి మంటలు మరింత వ్యాపించకుండా చర్యలు చేపట్టాయి. లోహిత్-అంజా బెల్ట్‌లోని గ్రామాల వైపు మంటలు ముందుకు రాకుండా హెలికాప్టర్ ద్వారా నీటిని జార విడిచాయి. గాలులు, పొడి పరిస్థితులు మంటలను రేకెత్తించే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయంతో పని చేశారు. నాగాలాండ్ (Nagaland)లోని జుకో వ్యాలీలో 30 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో మంటలు అదుపులోకి రావడం లేదు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.